: ఆ ఇంజినీరు అక్రమాస్తులు.. రూ.కోటి 50 లక్షలు!
ఆ ఇంజనీరు ప్రభుత్వోద్యోగం చేస్తున్నాడు. అవినీతికి పాల్పడ్డాడని ఆరోపణలు రావడంతో ఆయన ఇంటిని సోదా చేసిన ఏసీబీ అధికారులకు ఆదాయానికి మించిన ఆస్తుల వివరాలు లభించాయి. ఒకటి, రెండూ కాదు.. ఏకంగా ఆయన కోటి 50 లక్షల రూపాయలను అక్రమార్జన చేసినట్లు తేలింది.
పంచాయతీరాజ్ శాఖలో చీఫ్ ఇంజినీరుగా పనిచేస్తున్న రాంపల్లి జగన్మోహన్ ఇంట్లో ఇవాళ (శుక్రవారం) అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఏసీబీ అధికారులు ఆయన ఆస్తులను క్షుణ్ణంగా పరిశీలించారు. జగన్మోహన్ కు ఆదాయానికి మించి 1.50 కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.