: ఆస్కార్ దక్కని వారికి విలువైన గిఫ్ట్ బ్యాగులు!
ఆస్కార్ అవార్డు దక్కించుకోవాలనేది ప్రతి ఒక్కరి ఆశ. కానీ, కొంతమందినే ఆ అవార్డు వరిస్తుంది. చాలా విభాగాల్లో పలువురు గట్టిపోటీ ఇచ్చి రన్నర్స్ గా మిగిలిపోతారు. అందుకు తీవ్ర నిరాశ పడతారు. ఇకనుంచి మాత్రం అలాంటి వారిని అసంతృప్తి పరచకుండా, ఖాళీ చేతులతో పంపకుండా విలువైన బహుమతి ఇవ్వాలని అవార్డు నిర్వాహకులు నిర్ణయించారు. ఈసారి నుంచి వారికి 'ఎవ్రి బడీ విన్స్ ఎట్ ద ఆస్కార్స్' పేరుతో 55వేల డాలర్ల (34 లక్షలు) గిఫ్ట్ బ్యాగులు అందిస్తారు. ఆ బ్యాగులో వైన్, చాక్లెట్ ఫ్లైట్ పెయిరింగ్, స్విజ్ తయారీ స్లోవాచ్, జాన్ లూయీస్ డిజైన్డ్ గాజులు, కెనెడియన్ రాకీస్, మెక్సికో జపాన్ దేశాలకు లగ్జరీ ప్యాకేజీలు, స్పా ట్రీట్ మెంట్లు.. ఇలా రకరకాల విలువైన బహుమతులు అందులో కలిసి ఉంటాయి. కాగా, ఈ సారి 86వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం మార్చి 2న జరగనుంది.