: సభలో అల్లరి చేసిన వారిపై ఎన్నికల్లో నిషేధం విధించాలి: కిషన్ రెడ్డి
తెలుగు ప్రజలు తలదించుకునేలా లోక్ సభలో మన రాష్ట్ర పార్లమెంటు సభ్యులు ప్రవర్తించారని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. లోక్ సభలో అల్లరి చేసిన వారిని.. సభ నుంచి బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయకుండా.. వారిపై నిషేధం విధించాలని ఆయన అన్నారు. అంతేకాకుండా వారికి.. మాజీ ఎంపీలకు ఇచ్చే సౌకర్యాలను కూడా ఉపసంహరించాలని ఆయన చెప్పారు. తెలంగాణ బిల్లుపై ఎవరికీ ఆందోళన అవసరం లేదని కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణ అంశంపై మా నాయకత్వంలో ఏ మార్పూ లేదని ఆయన అన్నారు. బీజేపీ వైఖరిలో మార్పు లేదని ఆ పార్టీ అగ్ర నేతలు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బీజేపీ యూ టర్న్ తీసుకుందని కమల్ నాథ్ చెబుతున్నారని, కానీ అదంతా అసత్యమేనని ఆయన అన్నారు.