: దేశ ప్రతిష్ఠను సోనియాగాంధీ దిగజార్చారు: టీడీపీ నేత సోమిరెడ్డి
హైదరాబాదులోని టీడీపీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్టాడారు. దేశ పార్లమెంటరీ వ్యవస్థను, దేశ ప్రతిష్ఠను సోనియా దిగజార్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోనియా బయట ఉండి, పార్లమెంటు లోపల ఎంపీలపై దాడి చేయించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీలపై తెలుగు వాళ్లే దాడి చేస్తోంటే, ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదని ఆయన అన్నారు. దాడిలో గాయపడిన వారికి న్యాయం చేయాల్సింది పోయి.. వాళ్ల పైనే చర్యలు తీసుకుంటామని చెప్పడం సిగ్గుచేటని సోమిరెడ్డి చెప్పారు.