: మేమూ ఆ రెండు దేశాల సరసన చేరతాం: ధోనీ


వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ కు తామిప్పటినుంచే సవ్యరీతిలో సమాయత్తమవుతున్నామని టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీ చెప్పాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో భారత్ డిఫెండింగ్ చాంప్ హోదాలో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న మొదలయ్యే ఆ టోర్నీ మార్చి 29న ముగుస్తుంది. కాగా, 2011లో భారత్ లో జరిగిన వరల్డ్ కప్ ను టీమిండియా నెగ్గింది. ఈసారీ అదే ఫలితం పునరావృతం చేస్తామని ధోనీ ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పటివరకు క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్లు మాత్రమే వెంటవెంటనే వరల్డ్ కప్ ను నెగ్గాయని, తామూ వచ్చే టోర్నీలో విజయభేరి మోగించి ఆ రెండు జట్ల సరసన చేరతామని ధోనీ పేర్కొన్నాడు. వెస్టిండీస్ 1975, 1979లో వరుసగా వరల్డ్ కప్ నెగ్గగా.. ఆస్ట్రేలియా 1999, 2003, 2007లో హ్యాట్రిక్ కొట్టింది.

  • Loading...

More Telugu News