: ఈ నెల 16న సీఎం రాజీనామా చేసే అవకాశం: టీజీ
ఈ నెల 16న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్ తెలిపారు. 16న సీఎం క్యాంపు ఆఫీసులో సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరం కలసి సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అవుతామని చెప్పారు. సమావేశానంతరం కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని అన్నారు. టీబిల్లుపై బీజేపీ యూటర్న్ తీసుకోవడం శుభపరిణామమని తెలిపారు. విభజన ఆగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.