: అఫ్జల్ గురుకు, లగడపాటికి తేడా లేదు: ఎంపీ పొన్నం
పార్లమెంటులో తాము ఎవరిపై దాడి చేయలేదని... దాడి చేశామని లగడపాటి అబద్దాలు చెబుతున్నారని... లోక్ సభలో అస్వస్థతకు గురై, ఆసుపత్రిలో చికిత్స పొందిన ఎంపీ పొన్నం ప్రభాకర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అఫ్జల్ గురుకు, లగడపాటి రాజగోపాల్ కు తేడా లేదని ఆరోపించారు. తాము కూడా పార్లమెంటులోకి తుపాకీ తీసుకొచ్చి, నలుగురుని చంపి... ఆత్మరక్షణార్థమే చంపేశామని అంటే ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనకు పాల్పడిన లగడపాటిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాకపోతే సివిల్ వార్ తప్పదని హెచ్చరించారు.