: పెళ్లి పేరుతో మోసం చేసిన ఎస్సై రంగనాథ్ గౌడ్ కు ఉద్వాసన
నెల్లూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ ను ఐజీ సునీల్ కుమార్ ఉద్యోగం నుంచి తొలగించారు. గుంటూరు జిల్లా పొన్నూరు ఎస్సైగా పని చేసినప్పుడు రజియా సూల్తానా అనే యువతిని పెళ్లి పేరుతో మోసం చేసిన వ్యవహారంలో రంగనాథ్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో ఎస్సై పలుసార్లు కోర్టు కేసులు కూడా ఎదుర్కొన్నాడు. రంగనాథ్ పై శాఖా పరమైన విచారణ కూడా కొనసాగింది. దాంతో, ఈ వ్యవహారానికి సంబంధించి రంగనాథ్ పై ఈ రోజు వేటు వేశారు.