: ఈ పరిస్థితుల్లో పార్లమెంటు నిర్వహణ కష్టసాధ్యం: అరుణ్ జైట్లీ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో యూపీఏ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభలో విపక్షనేత అరుణ్ జైట్లీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తన సొంత ఎంపీలనే అదుపు చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో నెలకొన్న సమస్యను పరిష్కరించడంలో ప్రధాని కార్యాలయం, హోం శాఖ విఫలమయ్యాయని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్లమెంటు సమావేశాలను నిర్వహించడం కష్టసాధ్యమని అభిప్రాయపడ్డారు.