: లోక్ సభలో నిన్నటి ఘటన దురదృష్టకరం: కావూరి
లోక్ సభలో నిన్న ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు చోటుచేసుకున్న సంఘటనలు దురదృష్టకరమని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. అయితే, బిల్లును క్యాబినెట్ లో టేబుల్ ఐటమ్ గా పెట్టినప్పుడే వ్యతిరేకించామన్న మంత్రి, టీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని పునరుద్ఘాటించారు. పార్టీ కన్నా ప్రజలు ముఖ్యమని, స్నేహపూర్వక వాతావరణంలో రాష్ట్ర విభజన చేయాలని కోరారు. ఈ మేరకు ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన కావూరి, హైదరాబాదును కనీసం పదేళ్లయినా యూటీగా చేయాలన్నారు. ఏపీ విభజన రాష్ట్రానికే కాదు దేశానికే మంచిది కాదని చెప్పారు. అన్ని పార్టీల అంగీకారంతోనే కేంద్రం నిర్ణయం తీసుకుందని, కానీ, రాష్ట్రాల విభజనకు నిర్దిష్టమైన మార్గదర్శకాలుండాలని పేర్కొన్నారు.