: ప్రతీ 28 మహిళలలో ఒకరికి ఆ సమస్య
గత 25 ఏళ్లలో భారతీయ మహిళలలో రొమ్ము కేన్సర్ బాగా పెరిగిపోయింది. సగటున ప్రతీ 28 మంది మహిళలలో ఒకరు ఆ సమస్య బారిన పడుతున్నారని ఇటీవలే ఒక అధ్యయనం తేల్చింది. పట్టణాలలో ప్రతీ 22 మంది మహిళలలో ఒకరికి.. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 60 మందిలో ఒకరికి రొమ్ము కేన్సర్ సోకుతోంది. ఈ నేపథ్యంలో ఆహారంలో మార్పులు, శారీరక వ్యాయామంతో మహిళలు ఈ సమస్య నుంచి తమను రక్షించుకునే అవకాశం ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఎప్పటికప్పుడు వక్షోజాలను పరీక్షించుకోవాలని.. సందేహం వచ్చినా, రాకున్నా ఏడాదిలో ఒక్కసారైనా వైద్యుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు. శారీరక వ్యాయామం చేసేవారికి రొమ్ము కేన్సర్ ముప్పుతక్కువని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కనుక అది పాటించడం మంచిది. ఆల్కహాల్ తాగేవారికి ఈ ముప్పు మరీ ఎక్కువట. కనుక దానికి దూరంగా ఉండాలి. సహజ సూర్యరశ్మి లభించేలా చూసుకుంటే .. దాని ద్వారా వచ్చే విటమిన్ డీ రొమ్ము కేన్సర్ రాకుండా సాయపడుతుందని వైద్యుల సలహా.