: స్వామిగౌడ్ పై విచారణ కొనసాగుతోంది: పోలీసులు
గచ్చిబౌలి ఉద్యోగుల ఇళ్ల స్థలాల కేసులో టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్ అక్రమాలకు పాల్పడినందుకు ఆయనపై ఛార్జిషీటు దాఖలు చేసినట్లు బేగంబజార్ పోలీసులు హైకోర్టుకు తెలిపారు. నాంపల్లి క్రిమినల్ కోర్టులో స్వామిగౌడ్ పై విచారణ జరుగుతోందనీ, 404, 406, 420, 120(బి), సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసినట్లు వెల్లడించారు. స్వామిగౌడ్ వ్యవహారంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై పోలీసులు ఈ మేరకు వివరణ ఇచ్చారు.