: 10 సెకన్లలో బిల్లు పెట్టడం సాధ్యమా?: జగన్
లోక్ సభలో 10 సెకన్లలో బిల్లు పెట్టడం సాధ్యమా? అని వైఎస్సార్సీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. బిల్లును సభలో ప్రవేశపెడుతున్నట్టు ఎవరికీ సమాచారం కూడా ఇవ్వలేదని విమర్శించారు. విభజన బిల్లును వ్యతిరేకించాలని రాజ్ నాథ్ సింగ్ ను కోరామని చెప్పారు. విభజన ప్రక్రియ కచ్చితంగా ఆగిపోతుందని భావిస్తున్నట్టు తెలిపారు. నిన్న పార్లమెంటులో జరిగిన ఘటనతో... ప్రజాస్వామ్యం బతికుందా? లేదా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు చరిత్రలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదని చెప్పారు. ఈ రోజు ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయిన అనంతరం మీడియాతో మాట్లాడారు.