: దేశంలో సాంకేతిక విప్లవం రావాలి: నరేంద్ర మోడీ


దేశంలో సాంకేతిక విప్లవం రావాలని గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్ లోని గాంధీ నగర్లో ఈరోజు మోడీ ఐటీ ఉద్యోగులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో యువతరానిదే కీలక పాత్ర అని అన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విధానాలు, నిర్ణయాల్లో యువతను భాగస్వాములను చేసి వారి సలహాలు, సూచనలు స్వీకరిస్తానని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News