: టెన్త్ క్లాస్ విద్యార్థితో ప్రేమలో పడిన ఫిఫ్టీ ప్లస్ మహిళ
ప్రేమ గుడ్డిదా..! తారతమ్యాలు పట్టించుకోదా..! ఈ జంటను చూస్తే అది నిజమేననిపించకమానదు. మీరట్ లో ఓ నడివయస్కురాలు టెన్త్ క్లాస్ విద్యార్థితో ప్రేమలో పడింది. విశేషమేమిటంటే ఆమెకి ఎనిమిది మంది పిల్లలు కూడా ఉన్నారు. వారిలో ఈ బాలుడి కంటే పెద్దవాళ్ళూ ఉన్నారు. తన ప్రేమను వ్యతిరేకించడంతో కుటుంబాన్ని సైతం త్యాగం చేసి, మహిళతో కలిసుండాలని తీవ్ర నిర్ణయం తీసుకున్నాడా టెన్త్ క్లాస్ విద్యార్థి. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. తన ప్రేయసితో వివాహం జరిపించాలంటూ వారిని వేడుకున్నాడు. ఈ బాలుడు ఢిల్లీలో ఓ పాఠశాలలో చదువుతుండగా, సదరు మహిళ పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. వయసు అంతరం భారీగా ఉండడం, సమాజ వ్యతిరేకత దృష్ట్యా ఇరువురి కుటుంబ సభ్యులు వారి అనుబంధానికి అడ్డుచెప్పారు. పోలీసులే ఏదో విధంగా తమను కలపాలంటున్నాడా కుర్ర ప్రేమికుడు. మరి, ఈ విచిత్ర కథ ఎటు మలుపు తిరగనుందో!