: ‘మనకు వాలెంటైన్స్ డే వద్దు’ : విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నిరసన


ప్రపంచవ్యాప్తంగా ఈరోజు (ఫిబ్రవరి 14) ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. అయితే, ప్రేమికుల దినోత్సవం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు వ్యతిరేకమని విశ్వహిందూ పరిషత్ (వి.హెచ్.పి), భజరంగ్ దళ్ చెబుతూ వస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఫిబ్రవరి 14న పార్కుల్లో ప్రేమికులు కన్పిస్తే.. పెద్దలకు చెప్పి మరీ పెళ్లిళ్లు జరిపించిన ఘటనలు కూడా ఉన్నాయి.

ప్రేమికుల దినోత్సవాన్ని నిరసిస్తూ హైదరాబాదులోని కోఠీలో వి.హెచ్.పి, భజరంగ్ దళ్ కార్యకర్తలు ఈరోజు ఉదయం ఆందోళన చేపట్టారు. తాము ప్రేమకు వ్యతిరేకం కాదని, అయితే ప్రేమికుల రోజు పేరిట భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను మంటగలిపే చర్యలనే తాము వ్యతిరేకిస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. ‘మనకు వాలెంటైన్స్ డే వద్దు’ అంటూ వారు చేసిన నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. తమ కంటికి ప్రేమ జంటలు కనిపిస్తే పెళ్లిళ్లు చేస్తామని.. ప్రేమికులకు భజరంగ్ దళ్ హెచ్చరికలు కూడా చేసింది.

  • Loading...

More Telugu News