: పెళ్లయిన మహిళే పురుషులకు చాలా హాట్: విద్యా బాలన్
పెళ్లయిన మహిళే మగవారిని మరీ ఉడుకెత్తిస్తుందని 'డర్టీ పిక్చర్' తార విద్యాబాలన్ అన్నారు. సిద్ధార్థ్ రాయ్ కపూర్ ను పెళ్లి చేసుకున్న ఈ భామ అనుభవంతో కొన్ని విషయాలను ఒక ప్రముఖ ఇంగ్లిష్ పత్రికకు చెప్పింది. పెళ్లయిన పడుచు మరొకరికి చెందని నిషేధించిన పండుతో సమానం కనుక.. అలాంటి వారు పురుషులకు చాలా హాట్ అంటోంది. 'మరి మీరు గర్భవతా?' అని అడిగితే 'లేదింకా.. గర్భం కోసం సిద్ధార్థ్ తో సమయం వెచ్చించాల్సి ఉంది.. అంత తీరికెక్కడిది? ఎవరి పనులలో వాళ్లం ఉన్నాం. ఒకరితో ఒకరు గడిపే సమయమే చిక్కడం లేదు. పెళ్లయినట్లే లేద'ని చెప్పింది. సరైన జోడీ దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకోవాలని ప్రతీ ఒక్కరికి సూచిస్తానని అంటోంది.