: పురంధేశ్వరి, మంత్రి బాలరాజుల మధ్య రౌడీ షీట్ చిచ్చు!
కేంద్ర మంత్రి పురంధేశ్వరి, రాష్ట్ర మంత్రి బాలరాజుల మధ్య చిచ్చు రేగింది. వివరాల్లోకి వెళ్తే, మాజీ కార్పొరేటర్ పోచిన హనుమంతు పై వున్న రౌడీ షీట్ ను తొలగించడానికి పురంధేశ్వరి ప్రయత్నించారు. అయితే, హనుమంతుపై రౌడీషీట్ ను కొనసాగించాల్సిందే అంటూ బాలరాజు అడ్డుపడ్డారు. దీంతో, వీరిద్దరి మధ్య వివాదం మొదలై తీవ్ర స్థాయికి చేరింది.