: ఈ నెల 16న సీమాంధ్ర నేతల సమావేశం: మంత్రి కాసు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మంత్రి కాసు కృష్ణారెడ్డి భేటీ ముగిసింది. దాదాపు అర్ధగంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో విభజన బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిన నేపథ్యంలో పలు విషయాలపై చర్చించారు. అనంతరం కాసు మాట్లాడుతూ, ఈ నెల 16న సీమాంధ్ర నేతల సమావేశం ఉంటుందని తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే తమ లక్ష్యమని... కొత్త పార్టీ, రాబోయే ఎన్నికలు కాదన్నారు. ఆ రోజే అన్ని విషయాలు చర్చిస్తామని చెప్పారు.