: ఫేస్ బుక్ లో మగ, ఆడ కాని వారి కోసం 50 ఆప్షన్లు
దేనికైనా నమోదు చేసుకునేప్పుడు దరఖాస్తులో మీరు ఆడా? లేక మగా? అనే ఆప్షన్ ఉంటుంది. ఏ లింగ వర్గం వారు ఆ ఆప్షన్ ను టిక్ చేస్తారు. కానీ, ఈ రెండింటికీ చెందని వారయితే? ఉన్న రెండింటిలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోక తప్పని స్థితి. కానీ, అలాంటి ఆడా, మగా కాని వారి మనోభావాలను ఫేస్ బుక్ గుర్తించింది. అలాంటి భిన్న లింగాలను తెలియజేసేలా 50 ఆప్షన్లను తన ప్రొఫైల్ నమోదు పత్రంలో చేర్చింది. ఆండ్రోజినస్ (ఉభయలైంగిక), బై జెండర్ (ద్విలింగ), ట్రాన్సెక్సువల్ (లింగ మార్పిడి) ట్రాన్స్ ఫిమేల్ (లింగమార్పిడి ద్వారా మహిళగా మారిన వారు), ట్రాన్స్ మేల్ (లింగ మార్పిడి ద్వారా పురుషులుగా మారిన వారు) ఇలా ఆప్షన్లను ప్రవేశపెట్టింది. ఇకపై తాము హీ, హర్, దెమ్ (అతను, ఆమె, వారు) అనే మూడింటిలో ఏదో ఒకటి కూడా ఎంచుకోవచ్చు. ఫలానా లింగంవారే తమ ప్రొఫైల్స్ ను చూసేలా కస్టమైజ్ సెట్టింగ్స్ కూడా సెలక్ట్ చేసుకోవచ్చు.