: శ్రీకాకుళం జిల్లాలోని పరిశ్రమలో భారీ విస్పోటనం.. అరకిలోమీటర్ మేర ఎగిరిపడ్డ పరికరాలు


శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలోని కాన్ కాస్ట్ పరిశ్రమలో భారీ విస్పోటనం సంభవించింది. పేలుడు ధాటికి పరిశ్రమలోని యంత్ర పరికరాలు చుట్టుపక్కల అర కిలోమీటర్ మేర ఎగిరిపడ్డాయి. ఒక్కసారిగా సంభవించిన ఈ హఠాత్పరిణామంతో పరిసరప్రాంత ప్రజలు భీతావహులయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా ప్రాంతానికి హుటాహుటీన చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విస్పోటనానికి కారణాలపై విచారణ జరుగుతోంది   

  • Loading...

More Telugu News