: 48 గంటల్లో 677 మంది అరెస్ట్
బుధ, గురు వారాల్లో.. మొత్తం 48 గంటల్లో రాజస్థాన్ వ్యాప్తంగా పోలీసులు 677 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడిన కేసుల్లో 75 మంది, లిక్కర్ స్మగ్లింగ్, అమ్మకాల కేసుల్లో 169 మంది, జూదం కేసుల్లో 342 మంది, అక్రమంగా ఆయుధాలను కలిగి ఉన్నందుకు 91 మందిని అరెస్ట్ చేశారు. ఈ వివరాలను రాజస్థాన్ పోలీసులు గురువారం రాత్రి వెల్లడించారు. రాజస్థాన్ లో కొలువుదీరిన బీజేపీ సర్కారు నేరాలను ఉక్కుపాదంతో అణచివేయడానికి చేపట్టిన 60 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ అరెస్ట్ లు జరిగాయి. రానున్న రోజుల్లో ఇంకెంతమంది జైలుకెళతారో చూడాలి!