: 'స్కాచ్' ప్రియులకు శుభవార్త


ఖరీదైన స్కాచ్ విస్కీ ఇక అందరికీ అందుబాటులోకి రానుంది. ఇప్పటి దాకా ఆకాశాన్నంటిన ఈ విదేశీ మద్యం ధర భారీగా తగ్గనుంది. ఇప్పటివరకు స్కాచ్ విస్కీపై దిగుమతి సుంకం 150% ఉండగా, ఇప్పుడది 40 శాతానికి దిగిరానుంది. యూరోపియన్ యూనియన్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, ముగిసిన తర్వాత స్కాచ్ విస్కీపై సుంకం తగ్గింపు ప్రకటన వెలువడుతుందని స్కాటిష్ డెవలప్ మెంట్ ఇంటర్నేషనల్ (ఎస్ డీఐ) కంట్రీ మేనేజర్ రూమా కుమార్ బుస్సీ తెలిపారు.

భారత్ 2012లో 16.5 మిలియన్ లీటర్ల (రూ.560 కోట్లు) స్కాచ్ విస్కీని దిగుమతి చేసుకుంది. 2011లో భారత్ లో పర్యటించిన స్కాచ్ విస్కీ తయారీదారుల సంఘం.. భారత్ లో స్కాచ్ విస్కీకి ఎంతో డిమాండ్ ఉందని, అయితే అధిక ధర కారణంగా చాలామంది నల్లబజారులో కొనుగోలు చేస్తున్నారని తెలిపింది. కస్టమ్స్ పన్ను కారణంగా షాపులో ధర ఎక్కువని, నల్లబజారులోనే తక్కువ ధరకు దొరుకుతోందని వివరించింది.

  • Loading...

More Telugu News