: లగడపాటి నాపై కూడా దాడి చేశారు: మధుయాష్కీ
ఒక పథకం ప్రకారమే లోక్ సభలో లగడపాటి రాజగోపాల్ దాడి చేశారని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ తెలిపారు. ఈ దాడులకు కేవీపీ రామచంద్రరావు డైరెక్షన్ లో, కావూరి సాంబశివరావు నివాసంలో వ్యూహ రచన జరిగిందని ఆరోపించారు. తనపై కూడా లగడపాటి దాడిచేశారని... ఫుటేజీ చూస్తే లగడపాటి దాడి చేశాడా? లేదా? అనే విషయాలు బయటకొస్తాయని తెలిపారు. ఎవరెన్ని చేసినా తెలంగాణ ఏర్పాటును అడ్డుకోలేరని యాష్కీ మరోసారి ఆశాభావం వ్యక్తం చేశారు.