: ఎన్నికల కేసులో సుష్మా స్వరాజ్ కు సుప్రీంలో ఊరట
బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ కు సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. ఈ మేరకు జబల్ పూర్ హైకోర్టులో సుష్మపై కొనసాగుతున్న విచారణపై సుప్రీం స్టే ఇచ్చింది. 2009 లోక్ సభ ఎన్నికల్లో సుష్మ మధ్యప్రదేశ్ లోని విదిష పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచారు. దీనిపై కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ కుమార్ పటేల్ ఆమె ఎన్నికను కోర్టులో సవాల్ చేశాడు. అదే సమయంలో సుష్మ కూడా పిటిషన్ వేయగా డిసెంబర్ 3న కోర్టు తిరస్కరించింది. అనంతరం విచారణ చేపట్టిన న్యాయస్థానం, ఈ నెల 14న తన (సుష్మ) సాక్ష్యాన్ని రికార్డు చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో సుష్మ సుప్రీం ఆశ్రయించారు.