: వీసా కుంభకోణంలో భారతీయ దంపతులకు పదేళ్ల జైలు శిక్ష
వీసా రాకెట్ నడుపుతున్న భారతీయ సంతతికి చెందిన దంపతులకు ఆస్ట్రేలియా న్యాయస్థానం పదేళ్ల కారాగార శిక్ష విధించింది. ఆస్ట్రేలియా దేశంలోని మెల్ బోర్న్ నగరంలో స్థిరపడిన ఈ జంట భారతీయ యువకుల నుంచి డబ్బులు తీసుకుని.. ఆస్ట్రేలియా అమ్మాయిలతో వివాహం జరిగినట్లు చూపించి వీసాలు ఇప్పిస్తున్నారు. ఈ వీసా కుంభకోణాన్ని విచారించిన ఆస్ట్రేలియా కోర్టు.. ముంబయికి చెందిన చేతన్ మోహన్ లాల్, ఆస్ట్రేలియాకు చెందిన ఆయన సతీమణి దివ్యకృష్ణలకు పదేళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో పాటు, వారు 17 వేల డాలర్లను జరిమానాగా చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది.