: మోడీ చాయ్ లో నల్లమందు కలుపుతారు జాగ్రత్త: బేణీ ప్రసాద్ వర్మ


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ వర్గాలు తమ విమర్శల దాడిని తీవ్రం చేశాయి. ఆయన నిన్న అహ్మదాబాద్ లో నిర్వహించిన చాయ్ పే చర్చపై కార్యక్రమాన్ని ఎద్దేవా చేస్తూ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బేణీ ప్రసాద్ వర్మ ఏమంటున్నారో వినండి. మోడీ చాయ్ లో నల్లమందు కలిపి ప్రజలను మత్తులో ముంచేస్తారని వ్యాఖ్యానించారు. అందుకే ఆయనతో ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. గతేడాది కూడా వర్మ మోడీపై నిప్పులు చెరిగారు. మోడీని ఓ పిచ్చి కుక్క అని అభివర్ణించారు. ఏ పిచ్చికుక్కను కూడా మన ప్రజాస్వామ్య దేవాలయంలోకి అనుమతించరాదని, ఆ దేవాలయాన్ని కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలదే అని అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News