: ఆ ఘటన యూపీఏ వైఫల్యాలకు మరో సాక్ష్యం: అరుణ్ జైట్లీ
పార్లమెంటులో ఈ రోజు చోటుచేసుకున్న ఘటనపై బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సభలో జరిగిన నేటి ఘటన యూపీఏ వైఫల్యాలకు మరో సాక్ష్యమని విమర్శించారు. ఇవాల్టి ఘటనకు పూర్తిగా కాంగ్రెస్ దే బాధ్యతన్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఎన్ డీఏ మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసిందన్నారు. పరిపాలన సాగించడంలో యూపీఏ వైఫల్యం పదేపదే బయటపడుతోందని జైట్లీ అన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడంలో కాంగ్రెస్ విఫలమైందని, ఈ వ్యవహారంతో ఆ పార్టీ నిట్టనిలువునా చీలిపోయిందని అన్నారు.