: పార్లమెంటు భద్రతా సిబ్బంది అదుపులో లగడపాటి
లోక్ సభలో తీవ్ర పరిస్థితులు, పెప్పర్ స్ర్పే చేసిన తర్వాత ఎంపీ లగడపాటి రాజగోపాల్ ను పార్లమెంటు భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన లోక్ సభ స్పీకర్ కార్యాలయంలో ఉన్నట్లు సమాచారం. అయితే, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇతర సభ్యులకు హాని కలిగించారనే అభియోగం కింద కేసు పెట్టనున్నారు.