: నాటి యువరాణి దుస్తుల పట్ల 'వేలం' వెర్రి


బ్రిటన్ యువరాణి ప్రిన్సెస్ డయానా కారు ప్రమాదంలో మరణించి ఏళ్లు గడుస్తున్నా, ఆమె ప్రాచుర్యం మాత్రం ఇంకా తగ్గలేదనడానికి నిదర్శనమే ఈ సంఘటన. ఈ అందాల యువరాణి ధరించిన అపురూపమైన దుస్తులు నిన్న లండన్ లో నిర్వహించిన వేలం పాటలో కోట్లు పలికాయి. అప్పట్లో తన అమెరికా పర్యటనలో అధ్యక్షభవనం వైట్ హౌస్ లో జరిగిన ఓ విందు కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆమె ధరించిన గౌను అత్యధికర ధర పలికింది.

ఈ కార్యక్రమంలో డయానా ఆ గౌను ధరించి, హాలీవుడ్ నటుడు జాన్ ట్రవోల్టాతో కలిసి నృత్యం చేసింది. అలాగే, 1992లో భారత పర్యటన సందర్భంగా ఆమె ధరించిన గులాబీరంగు గౌను కూడా అధిక మొత్తాన్ని ఆర్జించి పెట్టింది. ఈ వేలం పాట ద్వారా 71 కోట్ల రూపాయల వరకు వసూలైంది. ఈ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారు.     

  • Loading...

More Telugu News