: తెలంగాణ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు రాజేంద్రప్రసాద్ సవాలు


తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలైనా, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయినా 'తెలంగాణకు ప్రథమ శత్రువు బీజేపీ అని ఢిల్లీలో చెప్పండి' అని టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ సవాలు విసిరారు. ఓ టీవీ ఛానెల్ లో మాట్లాడుతూ, తెలంగాణ కాంగ్రెస్ నేత యాదవరెడ్డి 'బీజేపీ, టీడీపీలే తెలంగాణకు ప్రథమ శత్రువులు' అని చెప్పడంపై మండిపడ్డారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, చేతనైతే మరోసారి తెలంగాణ అగ్రనాయకత్వం అని భావిస్తున్న నేతలు ఈ మేరకు ప్రకటన చేయాలని సవాలు చేశారు. చంద్రబాబు నాయుడు లేఖ ఇవ్వడం వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం అయిందని ఆయన గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News