: మన్మోహన్ కు ఒబామా విందు చాలా కాస్ట్లీ
అమెరికా అధ్యక్ష పీఠాన్ని 2009లో ఒబామా అధిరోహించిన తర్వాత.. విందు రూపేణా ఎక్కువగా ఖర్చు చేసింది భారత ప్రధాని మన్మోహన్ సింగ్ కోసమే. ఈ కాలంలో ఆయన ఐదుగురు దేశాధినేతలకు గౌరవపూర్వకంగా విందు ఇచ్చారు. ఆ ఐదుగురిలోనూ ఖర్చు ఎక్కువ వెచ్చించింది మన్మోహన్ విందుపైనే.
2009 నవంబర్ 24న వైట్ హౌస్ లో మన్మోహన్ కు ఒబామా విందు ఇచ్చారు. ఇందుకు అయిన వ్యయం 5.72లక్షల డాలర్లు (రూ.3.54కోట్లు). 2010 మే 19న మెక్సికో అధ్యక్షుడు ఫెలిపే కాల్డెరాన్ కు ఇచ్చిన విందుపై చేసిన వ్యయం 5.63లక్షల డాలర్లు (రూ.3.49కోట్లు). ఇక, చైనా అధ్యక్షుడు హూ జింటావో విందుకు 4.12లక్షల డాలర్లు, జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ కు ఇచ్చిన విందుకు 2.15లక్షల డాలర్లు, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ మ్యుంగ్ విందు కోసం 2లక్షల డాలర్లను అమెరికా ప్రభుత్వం వ్యయం చేసింది.