: చిదంబరం వేధించారు.. పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఆరోపణ


ఆర్థిక మంత్రి చిదంబరం తనను వేధింపులకు గురిచేస్తున్నాడని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సుధీర్ కృష్ణ ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కమల్ నాథ్ కు ఓ లేఖ రాశారు. గత గురువారం ఢిల్లీలో జరిగిన ఓ అత్యున్నత స్థాయి సమావేశంలో చిదంబరం తనను అందరి ముందు అవమానించారని సుధీర్ లేఖలో పేర్కొన్నారు. 'మీ ఇంగ్లిష్ ఏమీ బాగోలేదు, ఇలా అయితే ఎలా? ఓ పని చేయండి, మీరు హిందీలో మాట్లాడండి, మీ కింది అధికారులు దాన్ని ఆంగ్లంలోకి తర్జుమా చేస్తారు' అని చిదంబరం తనతో అవమానకరరీతిలో మాట్లాడారని వివరించారు.

జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ (జేఎన్ఎన్ యూఆర్ఎమ్) కార్యక్రమంలోని పలు పథకాలకు ఆర్ధిక శాఖ నుంచి నిధుల విడుదల విషయమై జరిగిన భేటీలో చిదంబరం ఈ విధంగా మాట్లాడారని సుధీర్ లేఖలో పేర్కొన్నారు. అంతేగాకుండా, ఈ వ్యవహారాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్ దృష్టికీ తీసుకెళ్ళాలని కూడా ఆయన మంత్రి కమల్ నాథ్ ను కోరారు.

  • Loading...

More Telugu News