: మీడియాకు భయపడిన ధోనీ


టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మీడియా ఎదుటకు రావడానికి భయపడుతున్నాడు. కొద్దిరోజులుగా భారత క్రికెట్ వర్గాల్లో వేడి పుట్టిస్తున్న ఐపీఎల్ ఫిక్సింగ్ స్కాం దర్యాప్తు నివేదిక ధోనీ వైపూ వేలెత్తి చూపిస్తోంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి న్యూజిలాండ్ తో రెండో టెస్టు జరగనుండగా, మీడియా సమావేశానికి ధోనీ డుమ్మా కొట్టాడు. అతని స్థానంలో ఓపెనర్ శిఖర్ ధావన్ మీడియా ఎదుటకు వచ్చాడు. క్రికెట్ విషయాలు తప్ప మరే ఇతర అంశాలపైనా ప్రశ్నలు అడగరాదని టీమిండియా మేనేజ్ మెంట్ మీడియాకు స్పష్టం చేసింది.

కాగా, ధోనీతోపాటు రైనాకూ ఫిక్సింగ్ ఆనుపానులు తెలుసని సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ ముద్గల్ కమిటీ తన నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. ఇప్పటికే చెన్నయ్ సూపర్ కింగ్స్ యజమాని, బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ దోషి అని కమిటీ తేల్చింది. విచారణలో భాగంగా ధోనీ.. గురునాథ్ కేవలం క్రికెట్ పై అభిమానంతో జట్టు వెంట ఉండేవాడని, అతడికి సూపర్ కింగ్స్ తో ఎలాంటి సంబంధం లేదని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపైనా కమిటీ లోతుగా విచారించినట్టు తెలుస్తోంది. ఏదేమైనా, ధోనికి అంటినప ఫిక్సింగ్ మకిలి అంత తేలిగ్గా వదిలేట్టులేదు.

  • Loading...

More Telugu News