: బడ్జెట్ మినహా ఏ బిల్లుపైనా చర్చ చేపట్టకండి: అద్వానీ ఫైర్
లోక్ సభలో అవాంఛనీయ ఘటనలు జరగడంపై బీజేపీ అగ్రనేత అద్వానీ స్పందించారు. విభజన బిల్లును ప్రవేశపెట్టే సమయంలో... ఆ పార్టీ ఎంపీలే తీవ్రంగా ప్రతిఘటించే ప్రయత్నం చేశారని, సభలో కనీవినీ ఎరుగని ఘటనలు చోటుచేసుకున్నాయని చెప్పారు. మంత్రులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నా, సోనియాగాంధీ కలగజేసుకునే ప్రయత్నం కూడా చేయలేదని విమర్శించారు. నా పార్లమెంటరీ జీవితంలో ఇలాంటి రోజును చూడలేదని తెలిపారు. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో, పార్లమెంటులో బడ్జెట్ మినహా మరే బిల్లులపై చర్చ జరపడం మంచిది కాదని సూచించారు. అద్వానీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వేడి పుట్టిస్తున్నాయి.