: బేగంపేట విమానాశ్రయంలో విధ్వంసానికి పన్నాగం
రాష్ట్రపతి, ప్రధాని తదితర అత్యంత ప్రముఖులు దిగడానికి మాత్రమే వినియోగిస్తున్న బేగంపేట విమానాశ్రయంపై ఉగ్రవాదులు కన్నేశారు. ప్రముఖులు వినియోగించేది కావడంతో విధ్వంసానికి కుట్ర పన్నారు. ఈ మేరకు కేంద్ర నిఘా వర్గాలకు సమాచారం అందింది. అవి రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాయి. దీంతో బేగంపేట విమానాశ్రయ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాన ద్వారం వద్ద కంచె ఏర్పాటు చేశారు. వచ్చీ పోయే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ప్రజల సందర్శనను కూడా నిలిపివేశారు.