: ఇంత కాలం ఇలాంటి వాళ్లతోనా వున్నాం?: కోదండరాం
సభ జరగకుండా వుంటే బాగుండునన్న ఉద్దేశంతోనే సీమాంధ్ర సభ్యులు ఈ రోజు పెప్పర్ స్ప్రే వాడారని తెలంగాణా జేఏసీ నాయకుడు కోదండరాం ఆరోపించారు. 'అరె... ఇంతకాలం ఇలాంటి వాళ్లతోనా మనం కలిసి వున్నది?' అని బాధపడుతున్నామని ఆయన అన్నారు. సమస్యలుంటే చర్చించుకోవాలే కానీ, ఇలా హింసాత్మక పనులు చేయకూడదని ఆయన అన్నారు. ఈ సమయంలో తెలంగాణా ప్రజలు సంయమనంతో వుండాలని, అదే సమయంలో రాష్ట్రం సిద్ధించేవరకు ఏమరపాటుగా ఉండాలనీ కోదండరాం సలహా ఇచ్చారు.