: పార్లమెంటులో దౌర్జన్యం చేయడం తగదు: నామా
పార్లమెంటులో టియర్ గ్యాస్ వదిలి దౌర్జన్యం చేయడం తగదని టీ టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా పార్లమెంటులో చర్చిద్దామని అన్నారు. లోక్ సభ వాయిదా పడిన అనంతరం నామా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. పార్లమెంటును కాంగ్రెస్ పార్టీ బజారు స్థాయికి తీసుకొచ్చిందని విమర్శించారు.