: ఎంపీలందర్నీ చంపడానికి లగడపాటి యత్నించారు!: రమేష్ రాథోడ్
లోక్ సభలో ఆసీనులైన ఎంపీలందర్నీ హత్య చేయడానికి లగడపాటి రాజగోపాల్ ప్రయత్నించారని టీటీడీపీ ఎంపీ రమేష్ రాథోడ్ ఆరోపించారు. ఇది ముమ్మాటికీ హత్యాప్రయత్నమే అని చెప్పారు. సభలో మిరియాల పొడి చల్లిన లగడపాటిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు.