: 'మా'పొట్ట కొట్టొద్దండీ: టీవీ ఆర్టిస్టుల విన్నపం
డబ్బింగ్ సీరియళ్ళు ప్రసారం చేసి తమ పొట్ట కొట్టొద్దని తెలుగు టీవీ ఆర్టిస్టులు నేడు నిరసన ప్రదర్శన నిర్వహించారు. తెలుగు టీవీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు జూబ్లీహిల్స్ లోని 'మా'టీవీ ఆఫీసు ముందు దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా మాటీవీ యాజమాన్యానికి ఓ వినతి పత్రం ఇచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో కళాకారులు, సాంకేతిక నిపుణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.