: బిల్లు నేపథ్యంలో మొదలైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలు
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్ సభలో ఈ రోజు ప్రవేశపెట్టనున్న క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలు ప్రారంభమయ్యాయి. ముగ్గురు ఎమ్మెల్యేలు ఆదాల ప్రభాకర్ రెడ్డి, శ్రీధర్ కృష్ణారెడ్డి, బండారు సత్యానందరావు పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. తమ రాజీనామా లేఖలను పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకు పంపినట్లు చెప్పారు.