: పార్లమెంటు ఉభయసభలు ప్రారంభం.. వాయిదా


పార్లమెంటు ఉభయసభలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు వెల్ లోకి వెళ్లి తీవ్ర స్థాయిలో నిరసనలు తెలిపారు. కళ్లకు గంతలు కట్టుకుని వెల్ లోకి వెళ్లి ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో ఛైర్మన్ రాజ్యసభను గంట పాటు వాయిదా వేశారు. మరో వైపు లోక్ సభను సీమాంధ్ర ఎంపీలు సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలతో సభను హోరెత్తించడంతో స్పీకర్ లోక్ సభను గంట వాయిదా వేశారు. దీంతో ఉభయసభలు వాయిదా అనంతరం 12 గంటలకు ప్రారంభం కానున్నాయి.

  • Loading...

More Telugu News