: మోడీతో యూఎస్ అంబాసిడర్ నాన్సీ పావెల్ భేటీ


గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో అమెరికా రాయబారి నాన్సీ పావెల్ గాంధీనగర్ లో భేటీ అయ్యారు. ఈ సమావేశంతో అమెరికాకు, మోడీకి మధ్య ఏర్పడిన దూరం తొలగిపోతుందని భావిస్తున్నారు. 2002 గుజరాత్ అల్లర్ల ఘటనలో మోడీ తీవ్ర ఆరోపణలు ఎదుర్కోవడంతో కొంతకాలం నుంచి అమెరికా వీసా తిరస్కరిస్తూ వస్తోంది. అయితే, 2014 ఎన్నికలకు ప్రధాని అభ్యర్థిగా మోడీ పేరును ప్రకటించిన తర్వాత మాత్రం పునరాలోచనలో పడింది. అప్పటినుంచీ వీసాకు ఆయన దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని పలుమార్లు తెలిపింది. ఇక మోడీయే కాబోయే భారత ప్రధాని అని స్పష్టతకొచ్చిన అమెరికా ఆయనతో చర్చలు జరిపేందుకు ముందుకు రావడం గమనార్హం. స్వయంగా ఆ దేశ రాయబారే మోడీతో భేటీ అవడంతో ఉత్కంఠ నెలకొంది. అయితే, కేవలం సాధారణంగానే ఈ భేటీ జరుగుతోందని, వీసాకు సంబంధించి తమ దేశ చట్ట, విధానం ప్రకారం పరిశీలిస్తామని యూఎస్ స్టేట్ డిపార్ట్ మెంట్ ప్రతినిధి జెన్ తెలిపారు.

  • Loading...

More Telugu News