: తిన్న ఇంటి వాసాలు లెక్కబెడుతున్న కేంద్రం: విద్యార్థి సంఘాలు
కేంద్ర ప్రభుత్వం తిన్న ఇంటి వాసాలు లెక్కబెడుతోందని విశాఖలోని విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. విశాఖలో బంద్ సందర్భంగా విద్యార్ధి సంఘాల నేతలు మాట్లాడుతూ, అత్యధిక ఎంపీలను ఇచ్చి, సుపరిపాలన అందించమని అధికారం కట్టబెడితే, కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సొమ్ము తిని, ప్రజల నోట్లోనే మట్టికొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం తీరు తిన్నింటి వాసాలు లెక్కబెడుతున్నట్టు ఉందని అన్నారు. సీమాంధ్రలో ఏ రకమైన ప్రాతినిధ్యంలేని నేతలు విభజనను సమర్ధించడం శోచనీయమని వారు స్పష్టం చేశారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే కాంగ్రెస్ పార్టీ విభజనకు పూనుకోవడం దుస్సాహసమేనని వారు పేర్కొన్నారు.