: శాసనసభ ప్రారంభం ..గంటపాటు వాయిదా
శాసనసభ సమావేశాలు ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో పాల్గొనాలని స్పీకర్ కోరారు. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి జైతెలంగాణ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. సమావేశాల చివరిరోజు సహకరించాలని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా సభ్యులు పట్టించుకోకపోవడంతో సభను గంటపాటు వాయిదా వేశారు.