: నేడే లోక్ సభలో తెలంగాణ బిల్లు
లోక్ సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టేందుకు ముహూర్తం నేడే. లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టేందుకు రాష్ట్రపతి అనుమతినిచ్చినట్టు లోక్ సభ వ్యవహారాల సంఘం పేర్కొంది. ఆర్టికల్ 117(3) ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ఎంపీలకు సమాచారం ఇచ్చినట్టు సమాచారం. లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టేందుకు స్పీకర్ అన్ని చర్యలు తీసుకున్నారు. లోక్ సభ వ్యవహారాల జాబితా రెండో భాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశపెట్టనున్నారు.