: పత్రికాస్వేచ్ఛలో మన స్థానం అక్కడ..!


పత్రికలు ప్రజల గొంతుకలు. ఆ గొంతుకలకు అడ్డుకట్ట వేయాలని ప్రయత్నిస్తే ప్రజాస్వామ్యం మంటగలిసిపోతుంది, పత్రికాస్వేచ్ఛ అంతరించిపోతుంది. గొప్ప ప్రజాస్వామ్య దేశమని చెప్పుకుంటున్న మనం ప్రపంచం మొత్తం మీద పత్రికాస్వేచ్ఛ అంశంలో ఎక్కడున్నామో తెలిస్తే నివ్వెరపోతాం. తాజాగా వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్-2014 జాబితా విడుదల కాగా, 180 దేశాలకు గాను భారత్ 140వ స్థానంలో నిలిచింది. ఇక మన పక్కలో బల్లాలు పాకిస్తాన్, చైనా 158, 175వ స్థానాల్లో ఉన్నాయి. భారత్ లో పాత్రికేయులపై హింస తీవ్రంగా ఉందని, 2013లో భారత్ లో 8 మంది పాత్రికేయులు హత్యకు గురయ్యారని నివేదిక వెల్లడిస్తోంది. మీడియాపై ఆంక్షలు అదే రీతిలో ఉన్నాయని నివేదిక పేర్కొంది. కాగా, ఈ జాబితాలో ఫిన్లాండ్ తొలి స్థానంలో ఉండగా.. నెదర్లాండ్స్, నార్వే తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఫ్రాన్స్ లోని మీడియా రైట్స్ వాచ్ డాగ్ ఈ జాబితాను రూపొందించింది. మన పక్కదేశం శ్రీలంక ఈ జాబితాలో 165వ స్థానంలో ఉంది.

  • Loading...

More Telugu News