: చాయ్ తాగుతూ ‘చాయ్ పే చర్చ’ను ప్రారంభించిన నరేంద్ర మోడీ


అహ్మదాబాద్ నుంచి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ చాయ్ తాగుతూ ‘చాయ్ పే చర్చ’ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం దేశంలోని 300 పట్టణాల్లో లైవ్ టెలికాస్ట్ అవుతోంది. దేశంలోని వెయ్యి తేనీటి దుకాణాల్లో ‘మోడీ చాయ్ పే చర్చ’ కార్యక్రమాన్ని ప్రసారం చేసేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. మన రాష్ట్రంలో హైదరాబాదులోని ఓ టీస్టాల్, గుంటూరులోని ఓ టీస్టాల్ లో ఈ చర్చ లైవ్ టెలికాస్ట్ అవుతోంది. టీ విక్రయదారులతో నేరుగా మోడీ మాట్లాడుతున్నారు. ఆ వివరాలు మోడీ మాటల్లోనే..

‘‘చాయ్ అందరికీ ప్రీతిపాత్రమైంది. దేశంలో పేదలు అందరికీ చాయ్ బంధువు లాంటిది. మన దేశంలో టీస్టాల్ ఫుట్ పాత్ పార్లమెంట్. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని విషయాలూ అక్కడే చర్చకు వస్తాయి. అంతర్జాతీయ విషయాలు గురించి అక్కడే చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఏ టీస్టాల్ దగ్గరైనా సుపరిపాలన గురించే మాట్లాడుతున్నారు. దేశంలో సుపరిపాలన అందించడమే నా లక్ష్యం. దుష్ట పరిపాలన మధుమేహం లాంటిది. మధుమేహం ఓసారి వస్తే జీవితాంతం ఉంటుంది. ఆరోగ్యాన్ని అతలాకుతలం చేస్తుంది.. అలాగే దుష్టపాలన వల్ల ప్రజాజీవితం అతలాకుతలమవుతుంది.’’

  • Loading...

More Telugu News