: తాను సెక్సీగా ఉన్నానని పేరు మార్చుకుంది..!
తన పేరు ఏమంత ఆకర్షణీయంగా లేదని భావించిన ఓ అమెరికా మహిళ కోర్టు ద్వారా లీగల్ గా పేరు మార్చేసుకుంది. సెంట్రల్ ఓహియోకు చెందిన ఈవిడ పేరు షీలా రానియా క్రాబ్ ట్రీ. వయసు 41. అయితే, తన పేరులోని మొదటి పదం షీలా.. తన రూపాన్ని ప్రతిబింబించడంలేదని భావించిన సదరు అమెరికా అమ్మడు వెంటనే కోర్టును ఆశ్రయించింది. తాను శృంగారభరితంగా ఉంటానని తీవ్రంగా నమ్మిన ఆ పడతి మరేమీ ఆలోచించకుండా 'సెక్సీ' అని పేరు మార్చుకుంది. కోర్టు కూడా ఆమె విన్నపాన్ని మన్నించింది. ఇకపై ఆమెను అందరూ సెక్సీ రానియా క్రాబ్ ట్రీ అని పిలవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పేరు మార్పును ఆమె భర్తతో పాటు యవ్వనంలో ఉన్న ఆమె కుమార్తెలు అంగీకరించారట. పేరు మార్పు తనలో మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోందని సెక్సీ పేర్కొంది.