: కాంగ్రెస్ కు రాయపాటి సోదరుడు రాజీనామా


ఎంపీ రాయపాటి సోదరుడు, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ పీసీసీ సభ్యత్వానికి, కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఈ మేరకు గుంటూరులో ప్రకటన చేసిన ఆయన, సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న ఎంపీలను బహిష్కరించడం బాధాకరమన్నారు. నలభై ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న తమకు ఈ నిర్ణయం అత్యంత ఆవేదన కలిగించిందన్నారు. ఈ నెల 21 తర్వాత తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని రాయపాటి శ్రీనివాస్ చెప్పారు.

  • Loading...

More Telugu News